11, జనవరి 2012, బుధవారం

అండమాన్ లో మూలవాసులపై జరుగుతున్న దారుణాన్ని ఖండిద్దాం..


అండమాన్ దీవులలో పర్యాటకులను ఆకర్షించడానికి అక్కడి మూలవాసులైన జువారి తెగ వారికి రొట్టెముక్కలుఎరగా చూపి నగ్న నృత్యాలను చేయిస్తున్నారని మధ్యాహ్నం ABN లో కథనం ప్రచురించారు. ఆదివాసులపైకి జూలలో లా అరటిపళ్ళు, రొట్టెలూ విసురుతూ కోతులులా చూస్తున్నారని వ్యాఖ్యాత ఆవేదన వ్యక్తం చేసారు...

ఈ జవారీ తెగ వారు నేడు కేవలం నాలుగు వందల మూడు మందే వున్నారు.. ఈ తెగ వారిని అత్యంత ఆదిమ తెగగా గుర్తిస్తూ వారి జీవనానికి ఆటంకం లేకుండా చేయాల్సిన బాధ్యత కల అధికార గణమ్ ఇలా చేయడం దారుణం.

ఇంత
దారుణానికి ఒడిగడుతున్న పర్యాటక శాఖాధికారులను శిక్షించాలి. కేంద్ర గిరిజన శాఖా మంత్రి కిషోర్ చంద్ర దేవ్ దీనిని ఖండిస్తూ విచారణ చేపడతారని చెప్పారన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్నిసమకూర్చుకోవడానికి ఆదివాసులను జంతువులు మాదిరిగా వాడుకోవడాన్ని నిరసిద్దాం. ఖండిద్దాం.


జువారి తెగ




16, జూన్ 2011, గురువారం

నింగీ నేలా నీదేరా...



ఈ గాలీ, నేలా, నీరూ. నిప్పూ, నింగీ మాది

అని నినదిస్తున నీ గొంతు

భావి తరానికి ఓ ఆసరా కోసం

నీవెత్తిన ఆ చిరుపిడికిలి

ఈ గాంధారీ పుత్రులకు

కన్నెర్ర చేస్తోంది...

ఎవడికి కావాలి పిలగాడా నీ గోడు

నువ్వు మా జాతివాడివి కాదు

కులపోడివి కాదు

వున్నోడివి కాదు

లేక పోతేనా నీ పక్క

ఎన్ని ప్రకటనలో ఇచ్చేవాళ్ళం

ప్రతి పేపరోడు నీ గురించి రాసేవాడు

కానీ నీవు గోచీ గుడ్డా లేని ఆదివాసీవి

నీకొక్కడికే ఎందుకు ఈ గోలని

దీర్ఘాలు తీస్తున్నారు మరి

అభివృద్ధి నిరోధకుడుగా నీ మీద ముద్రవేసి

తీవ్ర వాదిని చేసి ఎన్ కౌంటర్ చేసేయాలని చూస్తున్నాడు

పోస్కో వాడు విదిలించి ఎంగిలి మెతుకులకు

వీళ్ళు కన్నతల్లినైనా పండబెట్టడానికి వెనకాడని సాములురా...

నువ్వు చచ్చిపోతే ఎవడిక్కావాలి?

నువ్వేసిన ఓట్లెన్ని? నువ్వు కట్టే ఆదాయప్పన్నెంత?

నువ్వుంటే ఎంత లేకుంటే ఎంత?

నీకింకా మా (అ)నాగరికత అంటనందుకు

చిదంబరం చీదరించుకుంటున్నాడక్కడ..

నవీన పట్టాయుడ్లు కలత చెందుతున్నారిక్కడ..

నీ గుడిసెపై ఓ డిష్ పెడ్తాం నీకో రంగుల డబ్బా ఇస్తాం

ఇంక నువ్వు నాగరీకుడవై పోతావ్!

మా సంపద పెరిగితే చాలు

పుడమి తల్లి పురుగులు పట్టిపోతే మాకేం?


అయినా నీ పిలుపు విన్న ప్రకృతి

నీకు తోడుగా వుందన్నది సత్యం!

ఆపకు నీ పోరాటం..

నీదే ఈ నేల...నీవే మా రేపటి కలల రాజువి...


(పోస్కో వ్యతిరేక పోరాటం ఈ రోజు తీవ్రమౌతున్న సందర్భంగా సంఘీభావంగా)

10, మే 2011, మంగళవారం

Appeal to join us (పోస్కో)

Appeal to join us on 17th and 18th of May 2011, to protest against forceful land acquisition process for POSCO.

We earnestly appeal to all the concerned citizens, friends and well
wishers to join us in the struggle against forceful land acquisition
by the state government of Odisha planned on 18th of May 2011. The
Government of Odisha, is all set to forcefully enter and acquire our
land on behalf of South Korea based Pohang Steel Company (POSCO). The
state government has started deploying security personnel at
Balithutha, a strategic point allowing entry to our area.

We are determined to continue and intensify our democratic struggle
till POSCO Company withdraws from the area in view of the illegal
order of Union Minister for Environment and Forests Jairam Ramesh
granting final clearance for diversion of over 1253 hectares of forest
land to the POSCO steel project on 2nd May 2011. We have re-erected
barricades in our villages to restrict the entry of officials into the
area. On 6th of May 2011, more than 100 villagers came together to
begin a dharna at Balitutha. Around seven platoons of security
personnel reached Balitutha and threatened to arrest us if we started
the dharana. Again on 7th May 2011, hundreds of people march together
to Balithutha in protest against the illegal decision of the
government. We are holding now series of meetings at the villages of
Nuagaon, Gobindpur, Trilochanapur and Dhinkia to finalise our strategy
to intensify our struggle.

At this critical juncture, we urge you all to join us on 17th and
18th in the democratic struggle, show the solidarity and extend your
support to fight against this injustice and build mass opinion against
the POSCO project.
We will soon declare our modus operandi of our struggle to be taken up soon.

In solidarity,
Prashant Paikary -09437571547
Spokesperson, Posco Pratirodh Sangram Samiti (PPSS)
May 10, 2011

--
Prasant Paikray
Spokesperson

Posco Pratirodh Sangram Saiti
Mobile - 9437571547

21, ఏప్రిల్ 2011, గురువారం

ధరిత్రీ దినోత్సవం



మన రోజువారీ జీవితంలో వేగంపెరిగిన దృష్ట్యా ప్రతి అంశానికి ఏదో ఒక దినోత్సవం పేరుతో జరుపుకోకపోతే అది ఎంత ప్రాణాంతకమైనదైనా లేక ఎంత అభిమాన పూర్వకమైనదైనా మరిచిపోతుంటాం.. అలాగే మన ఉనికికి అస్తిత్వానికి ఆధారభూతమైన ప్రకృతి భూమిని కాపాడుకోవడం గురించి ఎంతలా చెప్పుకున్నా మన కృషి అటువైపుగా చాలా తక్కువ శాతం మాత్రమే జరుగుతున్నదన్నది విస్పష్టం.. ఇటీవల జపాన్ లో వచ్చిన సునామీ, తుఫాన్ లు, భూకంపాలు మనల్ని ఎంతమాత్రం కదిలించడంలేదు.. భూమి లేకపోతే నిలువనీడలేదన్నది మరిచిపోయి దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాం చేజేతులా... న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, ధర్మల్ పవర్ ప్లాంట్లు, నర్మదా, పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటివి చేపట్టి ప్రకృతి భీభత్సానికి గురికావడానికి కారకులవుతున్నాం.. మనమంటే మనం కాదు కదా ప్రభువులు ఏలిన వారు చేస్తున్నదానికి మనమేం జేస్తాం అనుకోవచ్చు. కానీ వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనదే... వాళ్ళ వ్యాపార దృక్పథానికి ఏమీ అడ్డురావు. బాక్సైటు తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి మన ఉనికితో పాటు పర్యావరణ కాలుష్యం పెరిగి అటవీ సంపద నాశనమవుతుందని తెలిసినా నియాంగిరీ పర్వత శ్రేణులనుండి ఇటు పాడేరు వరకు తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.. ఇలా మానవుల ఉనికికి ముప్పుగా పరిణమిస్తున్న వాటిని తీవ్రంగా వ్యతిరేకించి పోరాటం చేయకపోతే అస్తిత్వాన్ని కోల్పోతాం.. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం మనపాలిట మృత్యువు అన్నది గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకొని, ప్రకృతి సంతులతను నిలబెట్టే దిశగా ప్రయత్నం తీవ్రతరం చేయక్పోతే ఎన్ని ధరిత్రీ దినోత్సవాలు వచ్చి వెళ్ళినా ప్రయోజనం లేదు...

రండి కలిసి భూమిని కాపాడుకుందాం....

12, ఏప్రిల్ 2011, మంగళవారం

గగనంలో గగారిన్ కు ఏభై ఏళ్ళు...

ట్రైనో బస్సో ఎక్కడానికి
భయపడే రోజుల్లో
తిరిగి వస్తావో రావో
తెలీని సుదూర శూన్యలోక
విహారానికి ఎగిరి వెళ్ళడానికి
ముందుకురికిన నీ తొలి
గుండెనిబ్బరానికి జోహార్లు
గగారిన్ యూరి గగారిన్!

చివ్వున నిప్పులు చిమ్ముతూ
నింగికెగసిన రాకెట్ తో
గగన విహారం చేసి
మానవాఃళి మొత్తానికి
ఓ మహత్తర మార్గాన్ని చూపి
నిబ్బరాన్ని కలుగజేసి
గుండెనిండా ఊపిరైన
నీ సాహసానికి జోహార్లు జోహార్లు..
(గగనంలో విహరించిన తొలి మానవుడు యూరి గగారిన్ సాహసానికి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా)
ఆనాటి వీడియో

11, మార్చి 2011, శుక్రవారం

విలయం..



కట్టుకున్నవన్నీ

పేకమేడలా
కూలిపోయిన
క్షణం...

మాటాడుకుంటున్న

మా మధ్య విరిగిపడిన

పైకప్పు...


వేలి చివరాశరాతో

నడుస్తున్న
చిన్నారిని

మింగేసిన అల...


కాలికింద
చీలిపోయిన

నేల తల్లి
నిర్దయగా
మమ్మల్ని

మింగేసి
ఖాళీని
పూరించుకున్న

దుర్దినం...


ఇంత దయలేనితనం

మా మీదనేల తల్లీ

చూపావు?

13, జనవరి 2011, గురువారం

భారతదేశం వలసలవారితో నిండినదే-సుప్రీం కోర్ట్ తీర్పు..

మహారాష్ట్రలో మే తొంభై నాలుగులో నందాబాయి అనే భిల్ ఆదివాసీ యువతిపై జరిగిన అత్యాచారం, దాడి, వివస్త్రను చేసి ఊరేగించడంపై ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులో భారతదేశం ఉత్తర అమెరికా వలే పూర్తిగా వలసల వారితో నిండిపోయిందని ఓ ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఈ దేశ ఆదివాసీ జనమే ఇక్కడి భూమిపుత్రులని తీర్పునివ్వడం చాలామందికి చెంపపెట్టులాంటిది. తీర్పు పాఠం చదవండి..

Full Text of SC Jud 351589a