
కట్టుకున్నవన్నీ
పేకమేడలా
కూలిపోయిన క్షణం...
మాటాడుకుంటున్న
మా మధ్య విరిగిపడిన
పైకప్పు...
వేలి చివరాశరాతో
నడుస్తున్న
చిన్నారిని
మింగేసిన అల...
కాలికింద
చీలిపోయిన
నేల తల్లి నిర్దయగా
మమ్మల్ని
మింగేసి ఖాళీని
పూరించుకున్న
దుర్దినం...
ఇంత దయలేనితనం
మా మీదనేల తల్లీ
చూపావు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
నన్ను మెరుగుపరిచేట్లు...