30, మే 2010, ఆదివారం

సెల్ సిగ్నల్స్ వలన ఆహార భద్రతకు ముప్పు



ఇప్పటికే జన్యు మార్పిడి పంటల వలన, పురుగు మందుల కారణంగా తేనెటీగల కాలనీలు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రమాదం సెల్ ఫోన్ విడుదల చేస్తున్న విద్యుదయస్కాంత రేడియేషన్ వలన కూడా ఉంటుందని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గమనించారు. సెల్ ఫోన్ రేడియేషన్ తేనెటీగల శరీరంలో ఉండే అయస్కాంతత్వంపై ప్రభావం చూపడం వలన తేనెటీగల సామర్థ్యం దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే తరంగాల కారణంగా తేనెటీగల తేనె సేకరించే సామర్థ్యం దెబ్బతిన్నట్లు కేరళకు చెందిన సయినుద్దీన్ పట్టాజే చేసిన అధ్యయనంలో కూడా వెల్లడైంది. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే సహజంగా జరిగే పరపరాగ సంపర్కం మందగించిపోతుందని, దీంతో కాయలు, పళ్ళ చెట్ల ఉనికి నశించి, ఆహార భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పిచ్చుకలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి పక్షిజాతులు సెల్ సిగ్నల్స్ వలన అంతరించిపోతున్నాయి. అలాగే వీటి వలన మన మెదడుపై కూడా దుష్ప్రభావాలు చాల వున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది మానవ సంబంధాలపై చూపుతున్న దుష్ప్రభావాలు మన గ్రహింపులో వున్నా మన దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ సెల్ ను ప్రస్తుతం వినియోగించకుండా ఆపే స్థితిలో లేము కాబట్టి దీనికి ప్రత్యామ్యాయ పద్ధతులపై నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు దృష్తి సారించకపోతే ఈ సెల్ ద్వాపరయుగంలోని ముసలంలా మన యుగాన్ని అంతం చేసె మహమ్మారి కాగలదు.


(ఆంధ్రజ్యోతి 29.05.2010 వార్త ఆధారంగా)

1 కామెంట్‌:

  1. భూమి పుత్రుడు గారికి నమస్కారాములు..బ్లాగ్ల్ లో మీరు రాస్తున్న వాటిని రెగ్యూలర్ గా చదువు తున్నాను..చాలా బాగుంటున్నాయి..చాల రోజుల నుంచి మీకు రీప్లయ్ ఇద్దామనుకుంటు సమయాభావం వలన రీప్లయ్ ఇవ్వలేకపోయను..ఇదిగో ఇన్నాళ్లు పట్టింది రీప్లయ్ ఇవ్వడానికి...అన్నట్టు నేను నాతో పాటు మామిత్రులం కలిసి ఉస్మానియా యూనివర్షిటి నుండి "క్యాంపస్ వాయిస్" అనే మాసపత్రికను నడుపుతున్నాము.మీకు వీలైతె ఈ మాసపత్రికకు వ్యాసాలు రాయండి.మీరు రాస్తున్న విషయాలు చాలమందికి ఉపయోగపడతాయి..పర్యావనం గురించయిన ఎదైన పర్వలేదు...మీకు వీలైతె ఈ లింక్ చూడండి. http://oucampusvoice.blogspot.com/

    రిప్లయితొలగించండి

నన్ను మెరుగుపరిచేట్లు...