11, జనవరి 2012, బుధవారం

అండమాన్ లో మూలవాసులపై జరుగుతున్న దారుణాన్ని ఖండిద్దాం..


అండమాన్ దీవులలో పర్యాటకులను ఆకర్షించడానికి అక్కడి మూలవాసులైన జువారి తెగ వారికి రొట్టెముక్కలుఎరగా చూపి నగ్న నృత్యాలను చేయిస్తున్నారని మధ్యాహ్నం ABN లో కథనం ప్రచురించారు. ఆదివాసులపైకి జూలలో లా అరటిపళ్ళు, రొట్టెలూ విసురుతూ కోతులులా చూస్తున్నారని వ్యాఖ్యాత ఆవేదన వ్యక్తం చేసారు...

ఈ జవారీ తెగ వారు నేడు కేవలం నాలుగు వందల మూడు మందే వున్నారు.. ఈ తెగ వారిని అత్యంత ఆదిమ తెగగా గుర్తిస్తూ వారి జీవనానికి ఆటంకం లేకుండా చేయాల్సిన బాధ్యత కల అధికార గణమ్ ఇలా చేయడం దారుణం.

ఇంత
దారుణానికి ఒడిగడుతున్న పర్యాటక శాఖాధికారులను శిక్షించాలి. కేంద్ర గిరిజన శాఖా మంత్రి కిషోర్ చంద్ర దేవ్ దీనిని ఖండిస్తూ విచారణ చేపడతారని చెప్పారన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్నిసమకూర్చుకోవడానికి ఆదివాసులను జంతువులు మాదిరిగా వాడుకోవడాన్ని నిరసిద్దాం. ఖండిద్దాం.


జువారి తెగ




2 కామెంట్‌లు:

  1. వీళ్ళుమనుషులా పశువులా ?అభంశుభం తెలుయని అమాయకులను ఇలా అవమానించి ఆనందం పొందటం. ఒక్కొక్కడ్ని నిలువునా చీల్చి పాతరేయాలి బాధ్యులైనవారిని

    రిప్లయితొలగించండి

నన్ను మెరుగుపరిచేట్లు...