3, డిసెంబర్ 2010, శుక్రవారం

సోంపేట ఉద్యమానికి ఏడాది..



ఈ రోజుకు సరిగ్గా ఏడాదిగా సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి పర్యావరణ పరిరక్షణ సమితి వారు నిరాహారదీక్షా శిబిరాన్ని ప్రారంబించి వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నేడు అక్కడ ఓ పెద్ద సభను నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు స్వామి అగ్నివేశ్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ మధ్యకాలంలో వారిపై జరిగిన దాడులు, పోలీసు కాల్పులు, పిపిఎస్ కన్వీనర్ డా.క్రిష్ణమూర్తి గారి ఆసుపత్రిలో బాంబు పేలుడు మొ.న విషయాలు అందరికీ ఎరుకలోనికి వచ్చినవే..


కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం వారు ఇంతలా పోరాటం చేస్తున్న కంటితుడుపుగా ప్రభుత్వం అక్కడి థర్మల్ పవర్ ప్రోజెక్టుకు అనుమతులు మంజూరు నిలిపివేసామన్నదే కానీ, అసలు భూసేకరణకు సంబంధించి, నిర్వాసితులకు తాయిలాలు చూపడానికి కొత్త కొత్త జీవోలు, సవరణలు తెస్తూ, కొత్తగా పెసా చట్టానికి తూట్లు పొడిచేందుకు కూడా వెనకాడకుండా ప్రజల నోరుమూయించి భూమిని, నీటిని, వనరులను ప్రైవేటు పరం చేసేందుకు పెద్దయెత్తున ప్రపంచబ్యాంకు సంస్కరణలను అమలు చేయడానికి ముందుకు దూసుకు వస్తోంది. సెజ్ లపేరుతో కొత్తగా సామంత రాజ్యాలను ఏర్పాటు చేసుకొనేందుకు పెట్టుబడిదారులకు, ఎం.ఎన్.సి.లకు అవకాశం కల్పిస్తూ దేశ సార్వభౌమత్వాన్నే అమ్మకానికి పెడుతోంది. దీనికి మన కార్పొరేట్ పాలక వర్గం తీవ్రంగా కృషి చేస్తూ, ఉద్యమాలను రకరకాల బూచిని చూపెడుతూ అణచివేయ జూస్తోంది.,

సోంపేట స్ఫూర్తితో ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణవాదులు, మేధావులు తప్పనిసరిగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి, ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నాం...

4 కామెంట్‌లు:

  1. chalaa manchi vishayam theesukunnaru. ee udyamaaniki prati okkaru sahakaaranni andichalsina avasaram undi

    రిప్లయితొలగించండి
  2. @sundar గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు. ఎవరికి వారే మనవరకు రాలేదు కదా అన్న నిర్లక్ష్యధోరణిలో వుండడం వలన పాలక వర్గాలు ఇది ఒక గ్రామానికో, మండలానికో వున్న సమస్యగా చూస్తూ, అణచివేయజూస్తోంది. కానీ మీలా అందరూ స్పందించాల్సిన అవసరమెంతైనావుంది. లేదంటే భవిష్యత్ తరాలకు ఈ భూగోళం మీద నివసించే చోటుండదు.

    రిప్లయితొలగించండి

నన్ను మెరుగుపరిచేట్లు...