17, ఫిబ్రవరి 2010, బుధవారం

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా?




తన రచనల ద్వారా మాతృదేశ బహిష్కరణకు గురై ప్రస్తుతం తానూ తన దేశంకంటే ఎక్కువగా అభిమానించే ఈ సువిశాల భారత దేశంలో తనకు నీడనిమ్మని దీనంగా వేడుకుంటున్న తస్లీమాను ఏ ప్రయోజనాలకు బలిచేస్తున్నారో? ముస్లిం వర్గం నుండి వచ్చిన బెదిరింపులకు లొంగి ఆమెకు జాగా లేకుండా చేయడం మానవత్వమా? ఇది మన అత్యంత భారీ ప్రజాస్వామ్యానికి నిదర్శనమా? హైదరాబాదులో తనపై దాడిచేసిన వారు అలా స్వేచ్చగా, ఎటువంటి కేసులు లేకుండా తిరగుతున్నారంటే మనది ఎంత ఓట్ల రాజకీయమో అర్థమౌతో౦ది.

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా? ఓ ఆడకూతురిని రక్షించుకోలేమా?

2 కామెంట్‌లు:

  1. ఎంత మాటన్నారండి తప్పు తప్పు. సెక్యులరిజం అంటే మీకింకా అర్ధం అయినట్టుగా లేదు.

    రిప్లయితొలగించండి
  2. తస్లీమా నస్రీన్ నాస్తికురాలు. యూరోప్ లో సెక్యులరిజం అంటే "separation of church and state" అని అర్థం. ఇండియాలో సెక్యులరిజం అంటే మైనారిటీ వోట్ బ్యాంక్ రాజకీయాలు నడపడం.

    రిప్లయితొలగించండి

నన్ను మెరుగుపరిచేట్లు...