23, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఆఫ్ఘన్ భూభాగంపై నాటో మారణకాండ



ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ఏరివేత పేరుతో ఇప్పటికే టన్నులకొద్ది బాంబు దాడులు చేస్తున్న నాటో దళాలు గత వారం రోజుల్లో సుమారు 50 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసాయి. మజ్రా ప్రాంతంలో మొన్న జరిగిన వైమానిక దాడిలో మూడు జీపులలో వెళ్తున్న సామాన్య పౌరులు 27 మంది చనిపోయారు. దీనిపై ప్రజలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో తమ కీలుబొమ్మ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా దీనిని ఖండిస్తూ సివిలియన్ మరణాలు లేకుండా చూడమని మొత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా నాటో కమాండర్ క్శమాపణలు చెప్పాడు. సారీ చెప్పినంత మాత్రాన వారి ప్రాణాలు తిరిగివస్తాయా? ఆఫ్ఘనిస్తాన్ పై గత 30 ఏళ్ళకు పైగా పరాయి దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్థానిక గిరిజనులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అగ్రరాజ్యం దాని ఫలితాన్ని అనుభవిస్తోంది. తిరిగి అదే ఉగ్రవాదాన్ని రూపుమాపుతానని అక్కడి ప్రజల మాన ప్రాణాలను హరిస్తోంది. ఎవరి భూభాగం వారు పాలించుకునే స్వేచ్చ లేకుండా తమ అవసరాలు తీర్చుకొనడానికి దురాక్రమణలు చేసి, అక్కడి ప్రభుత్వాలను కూలదోసి, తమ సొంత కీలుబొమ్మ పాలకులతో నడిపించి తమ వ్యాపారాలను నిరాటంకంగా చేసుకునే అగ్రరాజ్య దురహంకారాన్ని వ్యతిరేకించాలి. దానికి వత్తాసు పలికే నాటో సభ్యదేశాల కుటిల రాజనీతిని బయటపెట్టాలి.

2 కామెంట్‌లు:

  1. ఎక్కడ బయటపెట్టాలి ఎవరి ముందు బయట పెట్టాలి ? ప్రపంచానికి తెలియనిది వారెమన్నా చేస్తున్నారా ? బయటపెట్టినా వారెమన్నా బయపడటారా/

    రిప్లయితొలగించండి
  2. ఇదంతా సాధారణ ప్రజానీకానికి తెలియదు. పాలకవర్గాలు వీటికే వత్తాసు పలుకుతున్నాయి. కాబట్టే వారు భయపడని స్థితికి చేరుకున్నారు. మీలాంటి సామాజిక కార్యకర్తలు ప్రజలతో మమేకమైనపుడు అపుడపుడైనా మాటాడితే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి

నన్ను మెరుగుపరిచేట్లు...